యువ నటుడు తేజ సజ్జా తన పెళ్లి వార్తలపై స్పష్టత ఇచ్చారు. డిసెంబరులో రాజస్థాన్లోని ఉదయ్పుర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలిపారు. నవంబరులో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించనున్నామని, అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ ఉంటుందని చెప్పారు. తమది పెద్దలు కుదిర్చిన సంబంధమని, వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో సంబంధాలు లేవని, వారు టెక్నాలజీ వ్యాపారంలో ఉన్నారని వివరించారు.