భోపాల్‌లో తెలంగాణ CJP కార్యకర్తల అరెస్ట్

15చూసినవారు
భోపాల్‌లో తెలంగాణ CJP కార్యకర్తల అరెస్ట్
భోపాల్‌లో తెలంగాణకు చెందిన CJP కార్యకర్తలు స్టాన్లీ కొరాని, రంగసాయి రెడ్డి, రాజేష్ కొరపాక, వెంకటేష్ గౌడ్‌లను GRP, భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో CJP నిర్వహించనున్న శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు రైలులో వెళ్తుండగా, భోపాల్‌లో రైలు ఆగిన సమయంలో వారిని బలవంతంగా కిందికి దించి నిర్బంధించినట్లు పార్టీ వెల్లడించింది. ఏపీకి చెందిన బాబా ఫక్రుద్దీన్, బి. వెంకటేష్, రంజిత్ రాజీవ్‌లను కూడా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు CJP ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్