తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్లే రాష్ట్రం ఏర్పాటు తప్పనిసరి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ విమర్శించారు. సోనియా గాంధీ మనసులో తెలంగాణ లేదని, ఒత్తిడి వల్లే తెలంగాణ ఇచ్చారని ఆయన ఆరోపించారు. కరువు పరిస్థితుల్లో రూ.100 కోట్లతో
భారత్ సమ్మిట్ నిర్వహించడం వృథా ఖర్చని పేర్కొన్నారు. కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు మళ్లించారని ఆరోపించారు. మేడిగడ్డ నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కరువు సమయంలో మూసీ సుందరీకరణ పనులు అనవసరమని
కేటీఆర్ విమర్శించారు.