ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ

23చూసినవారు
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ
తెలంగాణకు చెందిన చిట్టెడి సుచిత్ర ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఆమె.. విక్టోరియా రాష్ట్రంలోని లావర్టన్‌ నియోజకవర్గం నుంచి ది రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో నిలిచారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది పోటీ చేస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు, కాలుష్య నియంత్రణ, నాణ్యమైన వైద్య సేవల కోసం కృషి చేస్తానని సుచిత్ర తెలిపారు. 2014లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె.. భర్త రాకేష్‌రెడ్డితో కలిసి అక్కడే స్థిరపడ్డారు.

సంబంధిత పోస్ట్