TG: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్టీవియా సమిట్-2026లో వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వాతావరణం స్టీవియా సాగుకు ఎంతో అనుకూలమని తెలిపారు. సరైన మార్కెటింగ్, ఒప్పంద సాగుతో ఈ పంట ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్టీవియా ఆకులను చక్కెర ప్రత్యామ్నాయంగా వాడతారని, సాగుపై అవగాహన కోసం రాజేంద్రనగర్లో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సాగుకు ప్రభుత్వ రాయితీలు కూడా లభిస్తాయి.