సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘80s వింటేజ్ స్టైల్’ ట్రెండ్ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలను 1980ల నాటి కాలేజ్ కుర్రాళ్లుగా మార్చిన ఏఐ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘శివ’ సినిమాలోని ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది..’ పాటకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, నాని,
ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్
ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ 80s హెయిర్‌స్టైల్స్, బెల్‌బాటమ్ జీన్స్‌తో కనిపించారు. ఈ వీడియోపై అభిమానులు తమ హీరోల లుక్స్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.