కెనడా మేయర్ బరిలో తెలుగు మహిళ (VIDEO)

19చూసినవారు
కెనడాలోని మిస్సిస్సాగా మేయర్‌ పదవికి తెలుగు మహిళ దీపికా దామెర్ల పోటీ చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు బాలీవుడ్‌ పాటను మార్చి పాడుతూ చేసిన ప్రచార వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నేను మేయర్‌ అయిన రోజు నుంచి ఆస్తి పన్నులు పెరగవు’ అంటూ సరదాగా పాడి ఆకట్టుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన దీపిక 1991లో కెనడాకు వెళ్లారు. టొరంటో విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసి, కార్పొరేట్‌ రంగంలో పనిచేశారు. 2018లో మిస్సిస్సాగాలోని ఏడో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లో గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్