AP: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేశవ్ చౌదరి (27) అమెరికాలో మృతిచెందారు. యూఎస్‌లో ఎంఎస్ పూర్తి చేసి, అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న కేశవ్, శనివారం రాత్రి మిత్రులతో కలిసి వాటర్ ఫాల్‌ను చూసేందుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. కాగా, కేశవ్ తండ్రి కంటిపూడి శ్రీనివాస్
టీడీపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.