రాష్ట్రంలో 3 రోజులపాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

7చూసినవారు
రాష్ట్రంలో 3 రోజులపాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
TG: రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశముంది. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలోని కొమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్