AP: నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 28 వార్డులలో
వైసీపీ 19,
టీడీపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో గొడవ మొదలైంది. ఇది రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతున్న కుట్ర అని, బ్యాలెట్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారని
వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. నిరసనలతో వాతావరణం వేడెక్కగా, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.