పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్ సహా 10 దేశాలకు
అమెరికా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలపై హౌతీలు దాడులు చేసే అవకాశం ఉందని
అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విమానాల రద్దు, గగనతలం మూతపడే అవకాశాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.