టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

26చూసినవారు
టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.200తో డిసెంబర్ 22 వరకు, రూ.500తో 2027 జనవరి 4 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. రెగ్యులర్ విద్యార్థులకు రూ.125, ఒకసారి ఫెయిలైన వారికి మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులకు అదనంగా రూ.60 ఫీజు ఉంటుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్