TG: మరో విడత కొత్త పెన్షన్ల మంజూరు!

24చూసినవారు
TG: మరో విడత కొత్త పెన్షన్ల మంజూరు!
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా 11,275 మందికి పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ రోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఫైలుపై సంతకం చేశారు. తొలుత ఈ నెల 19న పంపిణీ చేయాలని భావించినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పథకం ఆర్థిక భరోసానిస్తుంది.

సంబంధిత పోస్ట్