TG: అర్నబ్ తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.