TG:
జనసేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సమక్షంలో యాకుత్‌పుర నియోజకవర్గానికి చెందిన భజరంగ్ దళ్, గో రక్షక్ దళ్‌కు చెందిన పలువురు నాయకులు, యూత్ సభ్యులు
జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, శ్రీ రామ్ తాళ్లూరి పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారందరికీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.