
పండుగ వేళ ఆన్లైన్ మోసాలు.. డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి
పండుగల సీజన్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్పీసీఐ సూచిస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో వచ్చే నకిలీ లింకులు, ఓటీపీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. తెలియని వ్యక్తులు పంపే లింకులపై క్లిక్ చేయవద్దని, అధికారిక యాప్స్, వెబ్సైట్లలోనే షాపింగ్ చేయాలని సూచించింది. ఏదైనా లావాదేవీ విషయంలో 'స్టాప్, థింక్, యాక్ట్' సూత్రాన్ని పాటించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరింది.




