ఏసీ బస్సుల్లో మహిళలకు TGSRTC రాయితీ

6చూసినవారు
ఏసీ బస్సుల్లో మహిళలకు TGSRTC రాయితీ
TGSRTC మహిళా ప్రయాణికులకు మరో ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. తాజాగా ఏసీ బస్సుల్లో రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్లీ పాస్ తీసుకున్న మహిళలు 15 రోజుల ఛార్జీతో ఏసీ బస్సుల్లో నెలరోజుల పాటు ప్రయాణించవచ్చని తెలిపింది. దీంతో పాటు బస్ పాస్ వినియోగదారులకు 9 రకాల రాయితీలను ప్రకటించింది. ఈ ఆఫర్లు శనివారం (NOV 14) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్