ఢిల్లీలో థార్‌ బీభత్సం.. ఇద్దరి మృతి

55చూసినవారు
ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి అతివేగంతో దూసుకువచ్చిన థార్‌ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అంజు, సుఖ్‌బీర్‌ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం అనంతరం తప్పించుకునే యత్నం చేసిన వాహనదారుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు రోహిణిలో పాడి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్