TG: కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యక్తిగత కోరికలు, పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం సర్వశక్తులను ధారపోస్తానని ప్రకటించారు. మహిళల ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని, 2034 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.