అందుకే మౌనంగా ఉన్నా: రేణూ దేశాయ్‌

0చూసినవారు
అందుకే మౌనంగా ఉన్నా: రేణూ దేశాయ్‌
దీపావళి ముగిసినా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి రోజున దీనిపై మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకి అంటారనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నానని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. టపాసుల శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపాల పండుగను ఆనందంగా జరుపుకోవాలని, దాన్ని శబ్దాల పోటీగా మార్చకూడదని సూచించారు. రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించి, ఇతరులకు ప్రశాంతత కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్