TG: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణను దోచుకున్నారని, కేసీఆర్ ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఆ పాపమే ఆయనను వెంటాడుతుందని, కేసీఆర్ అరాచకాలకు ప్రకృతి శిక్ష విధిస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బీఆర్ఎస్ తప్పించుకుంటోందని, కీలక అంశాలపై చర్చించాల్సిన సమయంలో ఆందోళన చేసి బయటకు వెళ్తోందని విమర్శించారు. కాళేశ్వరం వ్యవహారంలో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (NDSA) సూచనల మేరకు ముందుకెళ్తామని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.