వృద్ధుడిని ఢీకొట్టిన బస్సు.. చివరికి

10708చూసినవారు
వృద్ధుడిని ఢీకొట్టిన బస్సు.. చివరికి
AP: విశాఖలోని కొమ్మాది జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురవాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న బస్సు, రోడ్డు పక్కన నిలబడి ఉన్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్