TG: సంగారెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని మంజీరా జలాశయం ప్రస్తుతం ఎండిపోయి, భూమి నెర్రెలుబారి కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి జాడ కరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇది నీటి ఎద్దడిని సూచిస్తున్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో కళకళలాడే ఈ జలాశయం, ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతూ నీటి ముప్పును గుర్తు చేస్తోంది.