పీఓపీ గణపతి విగ్రహాలతో జరిగే నష్టాలివే

137చూసినవారు
పీఓపీ గణపతి విగ్రహాలతో జరిగే నష్టాలివే
జిప్సంను 250 నుంచి 300 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయడం ద్వారా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తయారవుతుంది. ఇది నీళ్లలో కలిశాక తిరిగి జిప్సంగా మారుతుంది. ఈ రసాయనాలతో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. నీటిలోని చేపలు, ఇతర జలచరాలకుఈ రసాయనాలు హాని చేస్తాయి. నీటిలోని మొక్కలు కూడా చనిపోతాయి. వీటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల్లో సల్ఫర్, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, మెగ్నీషియం లాంటి భార లోహాలు ఉంటాయి. ఇవి నాడీ సంబంధ వ్యాధులు, పలు రకాల క్యాన్సర్‌కు కారణమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్