తెలంగాణలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఈసారి నాగోల్లో రూపుదిద్దుకుంది. తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణహిత గణపతిని తయారు చేశారు. ఖైరతాబాద్ విగ్రహం కంటే ఎత్తుగా, 72 అడుగుల ఎత్తుతో అష్టసిద్ధి మహాగణపతిగా శిల్పి కొత్తకొండ నగేశ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిమను తయారు చేశారు. ఇక్కడ 8 ఏళ్లుగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఎత్తును పెంచుతున్నారు. కర్రలు, గడ్డి, వరిపొట్టు, జనుము, కలకత్తా బంకమట్టి, సుతిలి, గంగమట్టితో చేసిన ఈ గణపతికి వాటర్ కలర్స్తో అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఈ నెల 26న మండపం వద్దే నిమజ్జనం చేయనున్నారు.