ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు

2చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
సాధారణ పుట్టగొడుగులు కిలోల లెక్కన తక్కువ ధరకు లభిస్తే, కొన్ని రకాల మష్రూమ్స్ మాత్రం వేల డాలర్లు పలుకుతాయి. వాటిలో వైట్ ట్రఫుల్‌ అత్యంత ఖరీదైనది. ఇటలీ, క్రొయేషియా ప్రాంతాల్లో చెట్ల వేర్ల దగ్గర నేలలో పెరిగే వీటికి ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటాయి. వీటిని గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్కల సాయం తీసుకుంటారు. సాగు కష్టం, అరుదుగా లభించడం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ. 2007లో 1.3 కిలోల వైట్ ట్రఫుల్‌ మకావు వేలంలో 3.3 లక్షల డాలర్లకు అమ్ముడైంది. భారత కరెన్సీలో కోట్ల రూపాయలకు సమానం.

సంబంధిత పోస్ట్