బ్రిటన్‌లోని డోర్సెట్ ప్రాంతం నోల్ బీచ్‌లో చనిపోయిన పఫర్‌ఫిష్ కనిపించడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సుమారు 17 అంగుళాల పొడవున్న ఈ చేపలో టెట్రోడోటాక్సిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, శ్వాస ఆగిపోయేలా చేయవచ్చు. చేప చనిపోయిన తర్వాత కూడా విషం అలాగే ఉంటుంది. అందుకే సముద్ర తీరంలో ఇలాంటి చేప కనిపిస్తే ముట్టుకోకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.