వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, బాపట్ల,
ఎన్టీఆర్ జిల్లాల్లోని అనేక మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ – హనుమకొండ NH-163పైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది.