అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌కు చెందిన మూడు వెంట్రుకలు భద్రపరిచిన చిన్న లాకెట్ వేలంలో ఏకంగా 4,000 డాలర్లు (సుమారు రూ.3.7 లక్షలు) పలికింది. 1799లో వాషింగ్టన్ మరణించిన సమయంలో ఈ వెంట్రుకలను లాకెట్‌లో భద్రపరిచినట్లు చెబుతున్నారు. ఈ లాకెట్ తొలుత ఆయన సన్నిహితుడు జాన్ గాడ్స్‌బై వద్ద ఉండగా, తర్వాత వారసుల ద్వారా పురాతన వస్తువుల సేకరణదారుల చేతికి చేరింది. గతంలో 2021లో ఇలాంటి మరో లాకెట్ 40,000 డాలర్లకు (సుమారు రూ.37 లక్షలు) అమ్ముడుపోవడం విశేషం.