తీవ్రరూపం దాల్చిన సౌదీ అరేబియా-హూతీల పోరు

8చూసినవారు
యెమెన్‌లోని జైలుపై సౌదీ వైమానిక దాడికి ప్రతీకారంగా హూతీలు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో 73 మంది గాయపడ్డారు. అంతకుముందు యెమెన్ జైలుపై సౌదీ దాడిలో ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారని హూతీల ఆరోగ్య శాఖ తెలిపింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు వెల్లడించింది. ప్రతీకారం తప్పదని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై సముద్ర దిగ్బంధనం విధిస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్