అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతాలను భారీ అలలు వణికిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో సుమారు 30 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. శాన్ఫ్రాన్సిస్కో తీరంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 1982 తర్వాత ఇంతటి భారీ అలలు చూడటం ఇదే తొలిసని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అసాధారణ వాతావరణ మార్పులకు ఎల్నినో ప్రభావం ఉందా అనే అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.