
రోడ్డును తలపించేలా హోర్డింగ్.. పైకి ఎక్కేసిన ట్రక్కు (వీడియో)
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వేపై రహదారిని తలపించేలా ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ వల్ల ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఆ హోర్డింగ్‌పై ఉన్న రహదారి డిజైన్‌ను నిజమైన రోడ్డు అని భ్రమపడి ఒక ట్రక్కు డ్రైవర్ హోర్డింగ్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత నెల రోజుల్లోనే ఈ హోర్డింగ్ కారణంగా ఐదు ప్రమాదాలు చోటుచేసుకోగా, ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.




