నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశపరిచినప్పటికీ, ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఎల్నినో ప్రభావంతో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు సాధారణంగా కురవాల్సిన 704 మి.మీ. వర్షపాతానికి గాను కేవలం 560 మి.మీ. మాత్రమే నమోదైంది. అయితే, గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా సీజన్ లోటు వర్షపాతం 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది.