చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న అనుబంధం ఎప్పటికీ చెరిగిపోనిదని ఆ జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ధోనీ లేకుండా సీఎస్కే లేదని, గత రెండు దశాబ్దాలుగా పరస్పర నమ్మకంతో తాము ప్రయాణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2008 ఐపీఎల్ వేలంలో ధోనీని జట్టులోకి తీసుకోవడం తన జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయమని, సీఎస్కే ఎల్లప్పుడూ అతడి సొంతిల్లేనని శ్రీనివాసన్ ఉద్ఘాటించారు. ధోనీ వ్యక్తిత్వం, విజయాలు జట్టుకు వెలకట్టలేని ఆస్తి అని ఆయన అభివర్ణించారు.