మత్తు పదార్థాల వినియోగం వల్ల కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా, కుటుంబాలు, మొత్తం సమాజానికి ప్రమాదం వాటిల్లుతోంది. దీనివల్ల కాలేయం, ఊపిరితిత్తులు, గుండె వంటి ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. మానసిక కుంగుబాటు, కోపం పెరిగి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోంది. డబ్బు కోసం నేరాలకు పాల్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఈ దురలవాటు ఒక తరాన్నే నాశనం చేసే శక్తి కలిగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక గౌరవం కోల్పోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి.