
లోకల్ ట్రైన్లో కృష్ణాష్టమి వేడుకలు.. వీడియో వైరల్
ముంబైలోని బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో కొందరు మహిళలు కృష్ణాష్టమిని వినూత్నంగా జరుపుకున్నారు. మహిళా కోచ్ను అలంకరించి, ఉట్టిని వేలాడదీసి, పాటలు, డ్యాన్సులతో సందడి చేశారు. ఒక యువతి ఉట్టిని పగులగొట్టగా, తోటి ప్రయాణికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కొందరు మహిళల ఉత్సాహాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు కదులుతున్న రైలులో ఇలాంటి వేడుకలు చేయడంపై ప్రశ్నిస్తున్నారు.




