ఫోన్ దొంగిలించి.. పాస్‌వర్డ్ అడిగిన దొంగ!

13చూసినవారు
ఫోన్ దొంగిలించి.. పాస్‌వర్డ్ అడిగిన దొంగ!
ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌లోని క్లెమెంట్ టౌన్‌లో సెప్టెంబర్ 12న కౌశికి ధ్యాని అనే యువతి ఫ్లాట్‌తో పాటు సమీపంలోని పీజీలు, హాస్టళ్లలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే దొంగిలించిన ఫోన్ డిస్‌ప్లేపై కనిపించిన కాంటాక్ట్ నంబర్‌కు మెసేజ్ చేసి, ఫోన్ అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్ అడిగాడు. వరుస చోరీలపై పోలీసులు స్పందించలేదని బాధితురాలు ఆరోపించగా, ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు

సంబంధిత పోస్ట్