అస్సాంలోని గువాహటిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కాలిగాబరా ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెంబడించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నంలో ఆమెను రోడ్డుపై సుమారు 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీల్లో రికార్డయింది. నిందితులు గొలుసుతో పరారయ్యారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. నెటిజన్లు మనుషుల ప్రాణాలకు విలువ లేదని, మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.