AP:
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందిగామకు చెందిన షేక్ మహబూబ్ సుభాని అనే వ్యక్తి తనను మూడో పెళ్లి చేసుకుని మోసం చేశాడని భార్య సోమేశ్వరి దేవి పోలీసులను ఆశ్రయించింది. భర్త ఫోన్ నుంచి మహిళలతో అసభ్యకర చాటింగ్లు గమనించి నిలదీయగా, అతనికి ఇదివరకే ఇద్దరు భార్యలున్నారని, మొదటి భార్యను హత్య చేశాడని తెలిసింది. తన డబ్బు, బంగారం లాక్కుని గర్భవతిని చేసి వదిలేశాడని, న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.