ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్లైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఖతార్ ఎయిర్వేస్, కాథే పసిఫిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. స్కైట్రాక్స్ వార్షిక జాబితా ప్రకారం, 2025 సెప్టెంబర్ 25 నుంచి 2026 ఆగస్టు మధ్య 300 విమానయాన సంస్థలకు సంబంధించి ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. భారత్కు చెందిన ఎయిరిండియా 57వ స్థానంలో నిలవగా, ఇండిగో 61వ స్థానంలో ఉంది.