ప్రపంచంలో అత్యంత చల్లని గ్రామం ఇదే

117చూసినవారు
ప్రపంచంలో అత్యంత చల్లని గ్రామం ఇదే
రష్యాలోని సైబీరియాలో ఉన్న 'ఒయ్‌మ్యాకాన్' ప్రపంచంలోనే అత్యంత చల్లని శాశ్వత నివాస ప్రాంతంగా గుర్తింపు పొందింది. 'పోల్ ఆఫ్ కోల్డ్'గా పిలిచే ఈ గ్రామంలో 1933లో అత్యల్పంగా -67.7°C ఉష్ణోగ్రత నమోదైంది. పర్వతాల మధ్య ఉండటం వల్ల శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు సగటున -46°C వద్ద ఉంటాయి. 500 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో ప్రజలు మంచును కరిగించి నీటిని పొందడం, నిరంతరం కార్ల ఇంజిన్లు ఆన్ చేసి ఉంచడం వంటి కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. పంటలు పండని ఈ ప్రాంతంలో ప్రజలు మాంసం, గడ్డకట్టిన చేపలపైనే ఆధారపడుతున్నారు.

సంబంధిత పోస్ట్