భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా గుజరాత్లోని కచ్. సుమారు 45,674 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ కంటే దాదాపు 31 రెట్లు పెద్దదైన ఈ జిల్లా, హర్యానా, కేరళ, గోవా వంటి రాష్ట్రాల కంటే కూడా విస్తీర్ణంలో పెద్దది. ఇక్కడి ‘గ్రేట్ రాణ్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారి పర్యాటకులను ఆకర్షిస్తుంది. సింధు లోయ నాగరికతకు చెందిన ధోలవీర, చారిత్రక నగరం భుజ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఉప్పు ఉత్పత్తి, హస్తకళలు, పశుపోషణకు కచ్ ప్రసిద్ధి చెందింది.