ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో కొండపై ఉన్న నిరయ్ మాతా ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయాన్ని ప్రతి ఏటా ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు. కేవలం ఐదు గంటలే అనుమతి ఉండటంతో భక్తులు భారీగా తరలివస్తారు. ఇక్కడ కుంకుమ, తేనె వంటివి కాకుండా కొబ్బరికాయ, అగరబత్తులతోనే పూజలు చేస్తారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని, ప్రవేశిస్తే చెడు జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.