TG: హైదరాబాద్ నాదర్గుల్ ఇంజినీరింగ్ కాలేజ్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈవెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సాకేత్, పునీత్, నిశాంతి యాదవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంజినీరింగ్ కళాశాలలో దాండియా ఈవెంట్లో లైటింగ్ పోల్ కూలి విద్యార్థిని మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి. నాణ్యత లేని లైటింగ్ పోల్ ఏర్పాటే కారణమని పోలీసులు గుర్తించారు.