గాంధీ జయంతి సందర్భంగా ఐటీ, ఇతర అనుబంధ సంస్థల ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ రానుంది. అక్టోబర్ 2 శుక్రవారం (గాంధీ జయంతి), 3 శనివారం, 4 ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. వారానికి 5 రోజులు పనిచేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. దీంతో చాలామంది పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఎల్లుండి పబ్లిక్ హాలిడే కావడంతో ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.