సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ముగ్గురు మృతి

32చూసినవారు
సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ముగ్గురు మృతి
TG: మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్