ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పరిధిలో గల బరాయిపూర్ గ్రామంలో సంచలనం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో భూగర్భంలో రహస్యంగా పాతిపెట్టిన కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించి, ఒక గదిలో తవ్వకాలు చేపట్టగా మూడు డ్రమ్ములు బయటపడ్డాయి. అందులో భారీగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.