తిరుపతిలోని డీబీఆర్ రోడ్డులో భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.