సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ సందీప్ మెహతా పేర్లను సిఫారసు చేసింది.