పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని
బీజేపీ కార్యాలయంలో పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీ సతీశ్ పూనియా సమక్షంలో ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పాతానమజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రా, కున్వార్ విజయ్ ప్రతాప్లు కమలం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ రాష్ట్ర కో-ఇంచార్జీ విరేంద్ర సచ్దేవ్, రాష్ట్ర
బీజేపీ చీఫ్ కేవాల్ సింగ్ థిల్లాన్ కూడా పాల్గొన్నారు.